![]() |
![]() |
.webp)
ఒక సీరియల్ గత కొన్ని రోజులుగా అత్యధికంగా వైరల్ అవుతోంది. అదే స్టార్ మా సీరియల్ లోని గుప్పెడంత మనసు. ఈ సీరియల్ లోని రిషి , వసుధారలకి అత్యధిక ఫ్యాన్ బేస్ ఉంది.
బుల్లితెర సీరియల్స్ లలో కార్తీకదీపం లోని డాక్టర్ బాబు, వంటలక్క జంట తర్వాత అంత హిట్ అయిన జంట గుప్పెడంత మనసు రిషి, వసుధారలు.. అయితే ఇప్పుడు ఈ సీరియల్ కి, ఈ సీరియల్ ని మొదటి నుండి చూస్తున్న అభిమానులకి రచ్చ రంబోల అన్నట్టు యుద్ధం జరుగుతుంది. స్టార్ మా టీవీ సీరియల్స్ ప్రోమోలు యూట్యూబ్ లో రిలీజ్ అవుతుంటాయి. వీటిల్లో గుప్పెడంత మనసు ప్రోమోకి టాప్ వ్యూస్, టాప్ కామెంట్లు వస్తున్నాయి. ఎంతలా ఇంటే ఈ సీరియల్ లోని రిషి అలియాస్ ముఖేశ్ గౌడ పాత్రని తమ సొంతింటి వాళ్ళలా చూసుకునేంతగా దగ్గరయ్యారు. అయితే మొన్నటి ఎపిసోడ్ లో రిషి ఫోటోకి దండేసి ఇంట్లోని వాళ్ళంతా ఏడ్చారు. అసలు రిషి చనిపోలేదు కదా.. ఎవరిని చూపించలేదు కదా.. రిషి బాడీ కూడా లేదు కదా.. అలా ఎలా కన్ఫమ్ చేసుకొని దండ వేస్తారంటు ఈ సీరియల్ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. ఇన్ని రోజులు ఇక వస్తాడని ఎదురుచూస్తున్న మాకు ఇదేనా మీరు చూపించేదంటూ ఈ సీరియల్ డైరెక్టర్ ని తిడుతూ పోస్ట్ లు చేస్తున్నారు.
మొన్న ఇన్‌స్టాగ్రామ్ లో గుప్పెడంత మనసు డైరెక్టర్ కుమార్ పంతం.. రిషి వచ్చే వరకు కథని మార్చి రాస్తున్నామని చెప్పగా ఫ్యాన్స్ చల్లబడ్డారు. అయితే ఇలా రిషి ఫోటోకి దండేయడంతో మళ్ళీ మొదలెట్టారు. ఇక దీనితో పాటు నిన్నటి ఎపిసోడ్ లో .. రిషి చనిపోయాడని తెగ సంబరపడిపోతారు శైలేంద్ర, దేవయానిలు. ఆ సందర్భంలో శైలేంద్ర.. ‘రిషి రిషి అని గుండెలు పగిలేలా ఏడిస్తే ఏం లాభం? పోయిన వాడు తిరిగి రాడు కదా.. అందుకే అంటారు.. అవకాశం మన చేతుల్లో ఉన్నప్పుడే ఉపయోగించుకోవాలి.. లేదంటే ఇలాగే ఉంటుంది’ అని అంటాడు శైలేంద్ర. ఇది ఇండైరెక్ట్ గా రిషిని అన్నాడా అనిపించేలా ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి రిషి అలియాస్ ముఖేష్ గౌడకి నిజంగానే ఆరోగ్య సమస్య ఉందా? లేక ఈ సీరియల్ మేనేజ్ మెంట్ తో ముఖేష్ గౌడ కాంట్రాక్టు ముగిసిందా అనేది తెలియాల్సి ఉంది. మరి ఈ ఫ్యాన్స్ చేసే కామెంట్లకి డైరెక్టర్ స్పందిస్తాడో లేదో చూడాలి.
![]() |
![]() |